Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

పట్టపగలే మట్టి దందా.. యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు..

Author Neti Sudiksha | 11 Aug 2026, 10:51 AM | మహబూబ్ నగర్
 పట్టపగలే మట్టి దందా.. యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు..

మాగనూరు, ఆగస్టు 11: మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండల పరిధిలోని నల్లగట్టు శివారులో పట్టపగలే భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్స్‌కవేటర్లతో మట్టిని తవ్వి టిప్పర్లలో తరలిస్తున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మట్టి తవ్వకాలకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారా? తవ్విన మట్టిని తరలించేందుకు రవాణా అనుమతులు ఉన్నాయా? అనే అంశాలను అధికారులు పరిశీలించాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు. మైనర్‌ మినరల్స్‌ తవ్వకం, రవాణా, అక్రమ క్వారీయింగ్‌ను అరికట్టాల్సిన బాధ్యత మైనింగ్‌ శాఖపై ఉందని వారు గుర్తుచేస్తున్నారు.
అధికారుల కనుసన్నల్లోనే దందా?
గత కొన్ని నెలలుగా మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లు తిరుగుతుండటంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకుండానే ఇంత బహిరంగంగా తవ్వకాలు ఎలా కొనసాగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు.