Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న యువకుడిపై ‘పాకిస్థానీ’ ముద్ర..

Author Neti Sudiksha | 19 Jun 2026, 11:45 AM | హైదరాబాద్
ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న యువకుడిపై ‘పాకిస్థానీ’ ముద్ర..

హైదరాబాద్‌ కాప్రాలోని జనప్రియ లేక్ ఫ్రంట్ సొసైటీలో నివాసితులకు, మేనేజింగ్ కమిటీ సభ్యులకు మధ్య జరిగిన ఒక తీవ్రమైన వాగ్వాదం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ఈ గొడవ జరుగుతున్న సమయంలో ఒక యువకుడిని ఉద్దేశించి అక్కడి వారు ‘పాకిస్థానీ’ అని పిలవడంతో వివాదం ఒక్కసారిగా ముదిరింది. దీనిపై సదరు యువకుడు తీవ్రంగా స్పందిస్తూ, “నన్ను పాకిస్థానీ అని ఎలా అంటారు? మా తాతగారు ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా దేశానికి సేవలు అందించారు” అని ఎమోషనల్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెద్ద సంఖ్యలో నివాసితులు, చూసేవారు ఉన్న సమయంలోనే ఈ వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే అక్కడ పోలీసు సిబ్బంది కూడా ఉన్నట్లు వీడియోలలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వివాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా అధికారికంగా తెలియరాలేదు. గొడవల సమయంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సొసైటీ నివాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.