Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు..

Author Neti Sudiksha | 02 Jul 2026, 09:00 PM | హైదరాబాద్
కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు..

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కీలక మంత్రిమండలి సమావేశానికి ఆమె రాకపోవడంపై సచివాలయ వర్గాలతో పాటు రాజకీయంగానూ పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్ననే సురేఖ తన విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పటికీ, ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీకి రాకపోవడం వెనుక బలమైన కారణాలే ఉండి ఉంటాయని అంతా భావిస్తున్నారు.
ప్రధానంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన వ్యవహారమే మంత్రి కొండా సురేఖ అసంతృప్తికి కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన శాఖకు సంబంధించిన అత్యంత కీలకమైన ఈ బోర్డు ఏర్పాటు విషయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తన అభిప్రాయాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదనే భావనతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తీవ్ర అలక పూనిన కారణంగానే కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగానే ఇవాల్టి కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నారని సచివాలయ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది.